జాగ్రత్త..ఈ సంకేతాలు కనిపిస్తే చికెన్ పాడైనట్లే!

11 September 2025

Samatha

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటూరు. చెప్పండి, పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు.

 ఇక సండే వస్తే చాలు ప్రతి ఇల్లూ చికెన్ వంటతో సందడిగా మారిపోతుంది. చాలా మంది ఇష్టంగా చికెన్ తింటారు

 ఇక ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా.. లేదా ఇంటికి అథితులు వచ్చినా కూడా అందరికి మొదట చికెన్ తీసుకరావాలనే ఆలోచనే వస్తుంది.

 ధర కూడా తక్కవ ఉండటంతో ఎక్కువ దీనికే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే చికెన్ తీసుకొచ్చే ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలంట.

 ఇప్పుడు మార్కెట్‌లో చాలా రోజులు నిల్వఉంచే చికెన్‌ను అమ్ముతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంటుంది.

 అందుకే చికెన్ ఫ్రెష్‌గా ఉందో లేదో చెక్ చేయాలంట. అది ఎలాంటే. అన్నింటిలో మొదటిది చికెన్ వాసన ద్వారా క్వాలిటీ చెక్ చేయవచ్చు. అది డిఫరెంట్ స్మెల్ వస్తే చెడిపోయినదిగా గుర్తించాలి.

తాజా చికెన్ తేలికపాటి వాసన కలిగి ఉంటుంది.  పాడైన చికెన్ బలమైన, పుల్లని, కుళ్ళిన వాసన కలిగి ఉంటుంది.అలాగే చికెన్ రంగు బట్టి కూడా అది మంచిదో లేదో తెలుసుకోవచ్చునంట.

 చికెన్ చెడిపోయినట్లయితే, దాని కలర్ లేత పసుపు రంగులోకి మారుతుంది.చికెన్‌ని జాగ్రత్తగా చూడాలంట, దానిపై ఫంగస్ లేదు. అచ్చు ఉంటే, చికెన్ చెడ్డది.