OCD అంటే ఏంటి.. దీని గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలివే!
12 September 2025
Samatha
ప్రస్తుతం చాలా మంది OCD బారిన పడుతున్నారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా అసలు OCD అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందాం.
OCD అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజాస్టర్. ఈ సమస్య ఉన్న వారు ఏవో తెలియను భయాలు,ఆలోచనలను కలిగి ఉండటాన్ని అబ్సెషన్స్ అని పిలుస్తారంట.
ఇవి రోజూ వారి జీవితంపై చాలా ఒత్తిడిని తీసుకొస్తాయి. అంతే కాకుండా తెలియకుండా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయడం, ఎక్కువ బాధతో ఉండటం ఉంటుందంట.
అలాగే ఓసీడీ ఉన్న వారు పదే పదే చేతులు కడగటం, చేసిన పనినే మళ్లీ చేయడం లాంటి పనులు ఎక్కువగా చేస్తుంటారు.
అంతే కాకుండా ఈ మానసిక వ్యాధి ఉన్నవారు, సూక్ష్మ క్రిముల గురించి అపోహా ఎక్కువగా ఉంటుందంట. అందువలన తుడిచిన ఫ్లోర్ మళ్లీ తుడవడం లాంటిది చేస్తారు
తాళం వేసిన తలపులను పదే పదే తనిఖీ చేయడం, ఏదైనా కార్ లాక్ వేసినా, వేశామా లేదా అని మళ్లీ చెక్ చేయడం అనేది మానసిక ఆరోగ్యానికి గురి అవ్వడాన్ని సూచిస్తుందంట.
ఇంటిని సర్దడం లేదా వస్తువులను క్రమంగా అమర్చడంలో కూడా ఓసీడీ ఉన్న వారు చాలా ఒత్తిడికి గురి అవుతారంట. ప్రతి సారి మదనపడతారంట.
ఈ సమస్య వ్యక్తి రోజూవారీ జీవితం పై చాలా ప్రభావం చూపుతుంది. అందువలన ఇలాంటి సమస్య అధికంగా ఉంటే తప్పకుండా వైద్య సహాయం తీసుకోవాలంట.