చాణక్య నీతి : ఈ నలుగురితో కలిసి జీవించినా మరణించినట్లేనంట!

13  September 2025

Samatha

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఎన్నో విషయాలు తెలియజేశాడు.

చాణక్యుడు ఎన్నో విషయాల గురించి గొప్పగా చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన కొంత మంది వ్యక్తులతో కలిసి ఉండే బంధం గురించి వివరించడం జరిగింది.

సంతోషకరమైన వ్యక్తుల మధ్య జీవితం చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ మాటలతో ఇబ్బంది పెట్టే వారి మధ్య ఉంటే బతికి ఉన్నా చనిపోయినట్లే అంటారు.

అయితే ఎలాంటి వారి మధ్య ఉండటం జీవించి ఉన్నా చనిపోయినట్లే? ఆ నలుగురు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఎన్ని సమస్యలు ఉన్నా, ఇంట్లో అప్యాయంగా పలకరించే భార్య ఉండాలంటారు. కానీ ఏ ఇంట్లోనైతే చెడు ప్రవర్తన కలిగిన భార్య ఉంటుందో, ఆ భర్త జీవితం నరకం లాంటిదే, తాను బతికినా మరణించినట్లేనంట.

అదే విధంగా క్రమ శిక్షణ లేని సేవకు, ఎప్పుడూ యజమానితో వాదిస్తూ, గొడవ పడుతూనే ఉంటే, ఆ యజమాని జీవించినా మరణించినట్లేనంట.

అలాగే ఎంత మంది బంధువులు ఉన్నా, కష్టసమయంలో సహాయం చేయని బంధువులు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే, వారితో కలిసి ఉన్నా ఆ జీవితం నరకం లాంటిదేనంట 

చెడు వ్యక్తితో స్నేహం కూడా మంచిదికాదంట, తన స్వార్థ ప్రయోజనాల కోసం స్నేహం చేసే వ్యక్తితో స్నేహం చేయడం అస్సలే మంచిది కాదంట.