డాక్టర్ వద్దకు వెళ్తే మొదట నాలుకే చూస్తాడు.. ఎందుకో తెలుసా?

25 September 2025

Samatha

ఉన్నట్లుండి నీరసం లేదా అలసట వంటి సమస్యలుంటే చాలు చాలా మంది దగ్గరిలోని ఆర్‌ఎమ్‌పీ దగ్గరకు, ప్రమాదం ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి వెళ్లి చూపెట్టుకుంటారు.

ఇక వెళ్లగానే డాక్టర్ మొదట నాలుక చూసిన తర్వాతనే , సమ్య గురించి అడుగుతారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు డాక్టర్ మొదట నాలుకనే ఎందుకుచూస్తారో..

అయితే నాలుక చూడటం వెనుక ఒక కారణం ఉన్నది. అది ఏమిటంటే? నాలుక రంగును బట్టి ఆ వ్యాధిని నిర్ధారించవచ్చునంట.

అందువలన డాక్టర్లు మొదట నాలుకనే చూస్తారంట, అయితే నాలుక ఏ రంగులో ఉంటే ఏ వ్యాధి ఉన్నట్లో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక పింక్ రంగులో ఉంటుంది. కానీ ఎవరి నాలుకనైనా తెలుపు రంగులో ఉంటే,వారికి లుకోప్లేకియా, ఫంగస్ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నట్లేనంట.

నాలుక ఎరుపు రంగులో గనుక ఉన్నట్లైతే బీ12 లేదా ఐరన్ లోపం ఉన్నట్లంట. నాలుక ఎరుపు రంగులో ఉంటే వారికి రక్తహీనత సమస్య ఉన్నట్లే.

అదే విధంగా కొందరు నోటిని సరిగా శుభ్రం చేసుకోపోతే నాలుక పసుపు రంగులో ఉంటుంది. కానీ కొందరిలో కామెర్లు వస్తే పసుపు రంగులో కనిపిస్తుందంట.

బ్యాక్టీరియా, నోటి ఆరోగ్యం బాగాలేని వారిలో నాలుక నలుపు రంగులో ఉంటుందంట. అలాగే జీర్ణ సమస్యలు అధికంగా ఉన్న వారిన నాలుక తెలుపు రంగులో ఉంటుందంట.