కాళీమాత ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా? పండితులు ఏమంటున్నారంటే?

24 September 2025

Samatha

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు.

ప్రతి అమ్మవారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తూ నవరాత్రులను సెలబ్రేట్ చేస్తారు. అంతే కాకుండా కొందరు తమ ఇళ్లలో కూడా దుర్గామాత విగ్రహాలు పెట్టి నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు.

అయితే ఇక దుర్గామాత ఆలయాన్ని సం దర్శించినప్పుడు చాలా మంది తప్పకుండా కుంకుమ, గాజులు, అమ్మవార్ల ఫొటోస్ తన వెంట తీసుకొచ్చుకుంటారు.

కానీ చాలా మందిలో ఉండే ఒకే డౌట్ ఏమిటంటే? కాళీమాత ఫొటో ఇంటికి తీసుకొచ్చుకోవచ్చా?  ఇంట్లో కాళీ మాత ఫొటో పెట్టుకోవడం మంచిదేనా?

కాగా, ఇప్పుడు దీని గురించే తెలుసుకుందాం? శక్తివంతమైన కాళీమాత ఫొటో ఇంట్లో పెట్టుకోవడం గురించి పండితులు ఏం చెబుతున్నారు? దీని పై వారి అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం.

కాళీ మాత ఫొటో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే? అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు. అదువలన ఫొటో ఇంట్లో పెట్టుకోకూడదంట.

చాలా మంది దసరా నవరాత్రుల్లో కాళీమాతను పూజిస్తారు కదా అనుకుంటారు. కానీ సౌమ్య రూపంలో ఉన్న తల్లి విగ్రహాన్ని మాత్రమే పూజిస్తారు. ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని తాంత్రికులు పూజిస్తారంట.

దేవి కాళికా మాతను, ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాన్ని తాంత్రికులు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అందువలన  ఈ రూపంలో ఉన్న అమ్మవారిని ఇంటిలోపల ఎవరూ పూజించరంట.