చూస్తే చిన్నవే కానీ, మీ గుండెకు మాత్రం పెద్ద ప్రయోజనం!
03 September 2025
Samatha
బఠానీలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. టైమ్ పాసాక్ కోసం, స్నాక్స్‌గా వీటిని ఎక్కువగా తింటుంటారు.
అయితే బఠానీలు తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఇవి చాలా మంచియంటున్నారు నిపుణులు.
పసుపు రంగు కలిగిన బఠానీలు కాస్త తియ్యగా, కొంత ఉప్పగా ఉంటాయి. నోటికి మంచి రుచిని ఇస్తాయి. అందుకే చాలా మంది వీటిని తింటారు.
అయితే ఈ బఠానీలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉంటాయి.
అందువలన ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, కార్డియా వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. గుండెను కాపాడుతాయంట.
అలాగే ఎవరైతే బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారో వారికి కూడా ఇవి చాలా మంచిదంట. ఇందులో పొటాషియం , యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి.
అందువలన వీటిని తీసుకోవడం వలన ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుందంట.
అదే విధంగా పసుపు రంగు బఠానీలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి కంటిని హానీకర కిరణాల నుంచి కాపాడతాయంట.