చాణక్య నీతి : ఇలాంటి లక్షణాలున్న భార్య ఉంటే, ఆ వ్యక్తి జీవితం ఆగమ్యగోచరమే!

25 September 2025

Samatha

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన భార్య భర్తల బంధం  గురించి ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది.

భార్య భర్తలు ఎలా ఉండాలి? ఎలాంటి భార్య దొరకడం అదృష్టం ఇలా ఎన్నో విషయాలు చాణక్యనీతి తన నీతి శాస్త్రం పుస్తకం ద్వారా తెలియజేశారు.

అలాగే ఆయన ఇలాంటి లక్షణాలున్న భార్య ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే, ఆయన జీవితం ఆగమ్యగోచరమే అంటూ చెప్పుకొచ్చారు.

చాణక్యుడి ప్రకారం ఏ భార్య అయితే భర్త కష్టంలో ఉన్నప్పుడు అతని వదిలి వేయాలని చూస్తుందో లేదా, అతనికి సహాయం చేయదో అలాంటి భర్త ఉన్న ఎలాంటి ప్రయోజనం ఉండదంట.

అలాగే ఇంట్లో భార్య ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, ఆమె ఇతరులతో వ్యవహరించే తీరు బాగలేకపోయినా ఆమెతో జీవితం కంటే వదిలివేయడమే ఉత్తమం.

అదే విధంగా భర్త దగ్గర డబ్బులు లేనప్పుడు , ఏ భార్య అయితే అతన్ని అవమానించి దూరం పెడుతుందో అలాంటి భార్యతో జీవితం నరకమేనంట.

అలాగే ఎప్పుడూ డబ్బు ఖర్చు చేయడం, అయినా ప్రతి దాంట్లో అసహనం వ్యక్తం చేసే భార్యతో జీవితం నరకంతో సమానం అంటున్నా చాణక్యుడు.

భర్తను అమితంగా ప్రేమించే భార్య తనతో ఎప్పుడూ నిజమే చెప్పాలనుకుంటుంది. కానీ భర్తకు ప్రతి సారి అబద్ధం చెబితే ఆమెను దూరం పెట్టాల్సిందేనంట.