ఉద్యోగం Vs బిజెనెస్..యువతకు ఏది బెస్టో తెలుసా?

25 September 2025

Samatha

ప్రస్తుత కాలంలో చాలా మంది యువకులు ఉద్యోగం చేయడం కంటే, బిజినెస్ పెట్టడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

మరి ప్రస్తుత కాలంలో యువత ఉద్యోగం చేయడం మంచిదా? లేక బిజినెస్ వైపు అడుగులు వేయడం మంచిదా? ఈ విషయం గురించే వివరంగా తెలుసుకుందాం.

చాలా మంది యువత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయాలా? బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తుంటారు ఈ క్రమంలో వారు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలంట.

నెలకు కొంత డబ్బు సంపాదించాలి, రోజూ వారి జీవితాన్ని గడుపుతూ వెళితే బాగుంటుంది అనుకునే వారు బిజినెస్ కంటే ఉద్యోగమే చేయడం బెటర్ అంట.

కానీ కొందరు తమ జీవితంలో డిఫరెంట్‌గా ఉండాలి, చిన్న వయసులోనే అందరికంటే గొప్పగా మంచి పొజిషన్‌లో ఉండాలి అనుకునే వారికి బిజినెస్ బెటర్.

అలాగే బిజినెస్ చేయాలనే డ్రీమ్ ఉంటే సరిపోదని చెబుతునున్నారు నిపుణులు. ఎందుకంటే, దాని కోసం ఎన్నో విషయాల్లో సమర్థవంతంగా ఉండాలి.

ముఖ్యంగా ఎలాంటి వ్యాపారం చేయాలి? అందులో సక్సెస్ అవ్వడానికి బెస్ట్ టిప్స్ ఏంటి? ఎక్కడ ఎలా వ్యాపారం పెడితే సక్సెస్ అవుతాం అన్నవాటిపై మంచి క్లారిటీ ఉండాలి.

అలా ఆర్థికపరమైన సపోర్టు ఉండటం కూడా చాలా అవసరం అంటున్నారు నిపుణులు. అలాగే ఓపిక, ధైర్యం, సమయస్పూర్తి ఇవన్నీ ఉంటేనే సక్సస్ అవుతారంట.