నీ అందంతో అలా చంపకే పిల్లా.. రాశిఖన్నా బ్యూటిపుల్ ఫొటోస్!
04 october 2025
Samatha
అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది.
ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, మొదటి సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
మొదటి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తర్వాత సందీప్ కిషన్ సరసన జోరు సినిమాలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక ఈ మూవీ తర్వాత రాశిఖన్నాకు వరసగా ఆఫర్స్ రావడంతో, టాలీవుడ్ స్టార్ హీరోల అందరిసరసన నటించి మెప్పించింది. ప్రతి ఒక్కరితో ఆడిపాడింది ఈ బ్యూటీ.
అయితే స్టార్ హీరోల అందరిసరసన నటించి మెప్పించినప్పటికీ, ఈ అమ్మడు మాత్రం స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ట్యాగ్ సంపాదించుకోలేకపోయింది.
ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను అందుకుంటూ.. తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
కోలీవు, మాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధు జొన్నల గడ్డ సరసన ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా పర్పుల్ కలర్ చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.