కొత్తి మీర తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే !

06 october 2025

Samatha

కొత్తిమీర గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా, అద్భుతమైన రుచినిస్తుంది.

కొత్తిమీర ఏ సీజన్‌లో అయినా దొరుకుతుంది. అలాగే,  దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఇంటిలో ఏ కర్రీ వండినా కానీ కొత్తిమీర ఉండాల్సిందే. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరే లెవల్ ఉంటుంది.

ఇక కొత్తి మీరలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే, కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ తో పోరాటి, శరీర కణాలను రక్షిస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి.

కొత్తి మీర ప్రతి రోజూ వంటల్లో ఉపయోగించడం వలన ఇవి జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

జీర్ణ క్రియ సాఫీగా సాగడంలో కూడా కొత్తిమీర కీలకంగా వ్యవహరిస్తుందనే చెప్పాలి. దీనిని తినడం వలన అజీర్తి సమస్యలు తొలిగిపోతాయి.

కొత్తిమీర ఆకులో ఉండే నూనెలు, జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజ పరిచి, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది.కడుపు సమస్యలు తగ్గిస్తుంది.

కొత్తిమీరలో ఉండే సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి సహాయపడతాయి.