పల్లీలతో పది ప్రయోజనాలు.. ఇది తెలిస్తే తింటూనే ఉంటారు!
11 october 2025
Samatha
పల్లీలను కొందరు ఎంతో ఇష్టంగా తింటే మరికొంత మంది అసలు వీటిని తినడానికే ఇష్టపడరు. కానీ పల్లీలు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
మంచి పోషక విలువలు ఉన్న వాటిలో పల్లీలు ఒకటి. ఇందులో అద్భుతమైన పోషక విలువలు, విటమిన్స్ ఉన్నాయంట. అందువలన ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
గుండె ఆరోగ్యానికి వరం పల్లీలు అని చెప్పాలి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన చెడు కొవ్వును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా ఇది సూపర్ ఫుడ్. వేరుశనగల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్, కడుపు నిండిన అనుభూతిని కలిగించి, ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గవచ్చును
వేరుశనగల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అందువలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
వేరుశనగ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే రెస్వెరా ట్రాల్ వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి దోహదపడతాయి. అలాగే ఆల్జీమర్స్ వ్యాధి నుంచి రక్షిస్తాయి.
వేరుశనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ప్రతి రోజూ గుప్పెడు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంట.
ఇక ఇందులో రాగి, మాంగనీస్, విమెన్స్, విటమిన్ ఈ, ఫోలెట్ వంటివి పుష్కలంగా ఉండటం వలన ఎముకల బలానికి తోడ్పడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు