తమలపాకులు చేసే మేలు తెలుసా?

11 october 2025

Samatha

తమలపాకులలో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ ఈ, ఐరన్, ఫైబర్, కార్బో హైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, ఎంజైమ్స్ వంటివి చాలా పుష్కలంగా ఉంటాయి

అందువలన వీటిని తినడం వలన శరీరానికి జరిగే మేలు అంతా ఇంతా కాదంట. తమపాకులు ప్రతి రోజూ తీసుకుంటే, షుగర్ సమస్యల నుంచి క్యాన్సర్ సమస్యల వరకు చెక్ పెట్టవచ్చునంట.

ప్రతి రోజూ లేదా వారానికి రెండు లేదా మూడు సార్లు మీరు తమలపాకులు తినడం వలన ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో తమలపాకులు కీలక పాత్రపోషిస్తాయి. వీటిని తినడం వలన మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

డయాబెటీస్ సమస్య ఉన్నవారు తప్పకుండా తమలపాకులు తినాలంట. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తుందంటున్నారు నిపుణులు.

తమలపాకులను రోజుకు ఒక్కటైనా తీసుకోవడం వలన ఇందులో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయట. క్యాన్సర్ కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే పుండ్లు, జలుబు, దగ్గు, కఫం సంబంధ సమస్యల నుంచి కూడా ఇవి మిమ్మల్ని కాపాడతాయి. అందుకే ఈ సమస్యలు ఉన్నవారికి తమలపాకులు వరం లాంటిదే.