సంపద తీసుకొచ్చే పూల మొక్కలు ఇదే.. ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు!

20 october 2025

Samatha

ప్రతి ఒక్కరి ఇంట్లో కొన్ని రకాల పూల మొక్కలు ఉంటాయి. అయితే కొన్ని ఇంటికి అందాన్ని తీసుకొస్తే కొన్ని మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తాయి.

అయితే ఈ మొక్కలు గనుక మీ ఇంటిలో ఉన్నట్లు అయితే మీ ఇంటిలో సంపద పెరగడమే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలా కలిసి వస్తుందంట. ఆ మొక్కలు ఏవో చూద్దాం.

వాస్తు ప్రకారం మోదుగ చెట్టు ఇంటి వద్ద ఉండటం చాలా మంచిదంట. ఎవరి ఇంటి పరిసరాల్లో అయితే ఈ మొక్క ఉంటుందో, వారికి డబ్బుకు లోటే ఉండదంటున్నారు నిపుణులు.

శంఖు పువ్వు మొక్క ఆరోగ్యానికే కాదండోయ్, ఇంట్లోని ఆనందానికి కూడా కారణం అవుతుందంట. దీనిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇది ఇంట్లో శ్రేయస్సును పెంచుతుంది. దీని వలన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందంట.

ఎర్ర గులాబీలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే చాలా మంది అమ్మవారికి ఈ పూలను సమర్పిస్తుంటారు. అయితే ఈ ఎర్ర గులాబీ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.

అలాగే ఇంటిలో మందార పువ్వు మొక్క నాటడం కూడా చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క నాటడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట.

ఇంటిలోపల పారిజాతం మొక్కను నాటడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీని వలన మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందంట.

చాలా మంది ఇంటిలో మల్లెపూల మొక్క ఉంటుంది. అయితే ఈ సుగంధ వంటి వాసనను వెదజల్లే మల్లె పూల మొక్క ఇంట్లో నాటుకోవడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతుందంట