లీచీ పండు తినడం వలన కలిగే 8 ప్రయోజనాలు ఇవే!

16 october 2025

Samatha

లీచీ పండ్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ప్రమాదాలను తగ్గిస్తాయి.

లీచీ పండు ఫ్యాటీ లివర్ లేదా హైపటైటిస్ వంటి కాలేయ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

లీచీ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని నియంత్రిస్తుంది.

డయాబెటీస్ పేషెంట్స్‌కు అయితే ఇది వరం అనే చెప్పాలి. లీచీ పండ్లు తినడం వలన ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదపడతాయి.

లిచీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, వంటివి ఫ్రీరాడికల్స్‌ను తొలిగించి, చర్మాన్ని నిగారింపుగా తయారు చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో లీచీ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఫోలేట్ రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

లీచీ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధక సమస్యను తొలిగించి, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

లీచీలో ఐరన్ శాతం సమృద్ధిగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తినడం వలన రక్తహీనత తగ్గిపోయి, ఆరోగ్యంగా ఉంటారు.