పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

16 October 2025

SAMATHA.J

Images: Pinterest

పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచాలి అంటే తప్పకుండా ఈ ఫుడ్ మెనూ మీ పిల్లల డైట్ లో చేర్చాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవి ఏవో చూసేద్దాం పదండి

జ్ఞాపక శక్తి

వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అల్ఫాలినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే ఓమెగా,3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయంట.

వాల్ నట్స్

చియా విత్తనాలు ఆరోగ్యానికి చేసే మేలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిని ప్రతి రోజూ మీ పిల్లల ఆహారంలో చేర్చడం వలన వారి జ్ఞాపక శక్తి పెరుగుతుందంట.

చియా సీడ్స్

సోయా బీన్స్ లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని పిల్లలకు ఇవ్వడం వలన వారి మైండ్ పవర్ పెరుగుతుంది.

సోయా బీన్స్

గుమ్మడి గింజల్లో జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటివి చాలా ఉంటాయి. వీటిని పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వలన ఇది పిల్లల్లో మెమోరీ పవర్‌ను పెంచుతుంది. అవిసెలు

గుమ్మడి గింజలు

చాలా మంది ఆరోగ్యానికి మంచిదని అవిసె గింజలను స్మూతీలుగా తీసుకుంటారు. అయితే వీటిని మీ పిల్లల డైట్‌లో చేర్చడం వలన వారి ఆలోచన విధానం పెరుగుతుందంట.అవిసెలు

అవిసెలు

మిల్లెట్స్, సజ్జలు, రాగులు , కొర్రల వంటివి కూడా మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

మిల్లెట్స్

అందువలన వీటిని మీరు మీ పిల్లల ఆరోగ్యంలో చేర్చడం వలన ఇవి వారి జ్ఞాపక శక్తిని పెంచుతాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు

జ్ఞాపక శక్తి