షుగర్ వ్యాధి ఉన్న వారు కోడి గుడ్డు తినవచ్చా?

19 october 2025

Samatha

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్యల్లో డయాబెటీస్ ఒకటి. ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు.

రోజు రోజుకు డయాబెటీస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తీసుకుంటున్న ఆహారంజ జీవనశైలి కారణంగా సమస్య ఎక్కువ అవుతుంది.

అందుకే ఆరోగ్య నిపుణులు, ఆహారం విషయంలో తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంట. అయితే కోడి గుడ్డు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా, దీనిని రోజూ ఒకటి తినడం వలన రోగనిరోదక శక్తి పెరిగి, శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది.

అయితే డయాబెటీస్ పేషెంట్స్ ఉడకబెట్టిన కోడి గుడ్డు తినవచ్చా లేదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే?

కోడి గుడ్డు తినడం వలన షుగర్ ఉన్న వారిలో ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందంట.అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందంట.

వారానికి కనీసం నాలుగు కోడి గుడ్లు తినడం వలన ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్థాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది చాలా మంచిది.

కానీ కొంత మంది ఎక్కు కోడి గుడ్లు తింటారు ఇది మంచిది కాదు, వారానికి నాలుగు కంటే ఎక్కువ తినడం వలన దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదంట.