దీపావళి సమయంలో స్వీట్స్ లాగించేస్తున్నారా.. ఇది తెలిస్తే ముట్టను కూడా ముట్టరు!

18 october 2025

Samatha

దీపావళి పండుగ వచ్చేసింది. ఈ సమయంలో చాలా మంది ఎక్కువగా స్వీట్స్ తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

అయితే స్వీట్స్ ఎక్కువ తినడం వలన అనేక సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం

ఎక్కువ పంచదార ఉన్న స్వీట్స్ తినడం వలన దంత సమస్యలు వస్తాయంట. పళ్లు పుచ్చిపోవడం విరిగి పోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.

అందుకే వీలైనంత వరకు దంత సమస్యలు ఉన్నవారు అస్సలే స్వీట్స్ తినకూడదంట. దంత సమస్యలు లేని వారు చాలా తక్కువ మోతాదులో స్వీట్ తినాలంట.

స్వీట్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. అందువలన బరువు తగ్గాలి అనుకునే వారు అతిగా స్వీట్స్ తినడం వలన చాలా త్వరగా బరువు పెరుగుతారంట.

పంచదార ఎక్కువ తీసుకోవడం వలన మెదడు పనితీరు మందగిస్తుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు వస్తాయి. అందుకే చక్కెర అతిగా తీసుకోకూడదు.

స్వీట్స్ ఎక్కువగా తినడం వలన బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అంతే కాకుండా చిన్న వయసులోనే వృద్ధ్యాప్య ఛాయలు వస్తాయంట.

అందుకు వీలైనంత వరకు అతిగా స్వీట్స్ తీసుకోవడం మానేయ్యడమే ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు