బాలీవుడ్ బ్యూటీ ఆలియ భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన నటన, అందంతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకొని అందరి ఫేవరెట్ అయిపోయింది.
ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా దీపావళి స్పెషల్ లుక్‌లో అదిరిపోయింది. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అందాల ముద్దుగుమ్మ ఆలియాకు బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ అమ్మడు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
తాజాగా ఈ బ్యూటీ బేబీ పింక్ డ్రెస్‌లో తన అందాలతో మతిపొగొట్టింది. సింపుల్ గానే కనిపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. మరి మీరు కూడా ఈ ఫొటోస్ చూసెయ్యండి
ఈ ముద్దుగుమ్మ తన కుటుంబ సభ్యులతో దీపావళి పండుగ సెలబ్రెట్ చేసుకుంది. అందులో ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే,
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ ఆలియా, రణ్ బీర్ కపూర్ ఇద్దరూ దీపావళి స్పెషల్ లుక్‌లో అదిరిపోయారు. ఈ క్రమంలో నటి ఆలియా పింక్ డ్రెస్‌లో చాలా స్పెషల్ గా కనిపించింది.
పింక్ డ్రెస్‌లో చూడటానికి అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ వేడుకకు రణ్ బీర్ వైట్ కలర్ కుర్తా లో అందంగా ఉన్నాడు, వీరి జంట ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.