చలికాలంలో అల్లం టీ.. ఉదయాన్నే తాగితే ఎన్ని లాభాలో!
27 october 2025
Samatha
అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం లేవగానే కప్పు అల్లం టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవి అంటే?
అల్లం టీ లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన దీనిని ప్రతి రోజూ ఉదయం, కప్పు తాగడం చాలా మంచిదంట. ముఖ్యంగా చలికాలంలో తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట.
చలికాలంలో ఉదయాన్నే కప్పు అల్లం టీ తాగడం వలన ఇది జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే ఇందులో అనేక ఔషధ గుణాలు ఉండటం వలన ఉదయం లేచిన వెంటనే కప్పు అల్లం టీ తాగడం వలన ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది.
అల్లంటీ జీర్ణక్రియకు చాలా మంచిది. ఎవరైతే అజీర్తి, వికారం,వాంతులు, విరేచనాలు , గ్యాస్, మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో వారు అల్లం టీ తాగడం వలన ఆ సమస్య తగ్గిపోతుందంట.
అదే విధంగా, అధిక ఒత్తిడితో బాధపడే వారు అల్లం టీ తాగడం వలన ఆ సమస్య నుంచి బయటపడతారంట. అలాగే దీనిని చలి కాలంలో తాగడం వలన ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుందంట.
అల్లం టీ తాగడం వలన ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ముఖ్యంగా మీ కేలరీలను బర్న్ చేసి, రక్తపోటు తగ్గించి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
అల్లం టీ అధిక రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగు పరుస్తుంది. అదే విధంగా ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.