సీతా ఫలం పండ్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇవి చాలా స్వీట్‌గా ఉండటంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారిక వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు.
ఇక సీతా ఫలం పండ్లు ఎక్కువగా శీతాకాలంలో లభిస్తాయి. ఈ సీజన్‌లో ఇవి ఎక్కువగా దొరకడంతో ప్రతి ఒక్కరూ వీటిని తింటుంటారు.
సీతాఫలంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఈ సీజన్‌లో తినడం వలన ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే రక్తపోటును తగ్గించడమే కాకుండా, జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేసి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇక ఇందులో విటమిన్స్, ఖనిజాలలో పాటు, ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
సీతాఫలం తినడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది తినాలనుకుంటారు, కానీ డయాబెటీస్ ఉన్న వారు కూడా దీనిని తిన వచ్చా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.
సీతాఫలంలో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో షుగర్ స్థాయిలను పెంచే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు తినకూడదంట.
డయాబెటీస్ ఉన్న వారు దీనిని తక్కువ మోతాదులో తీసుకుంటే సమస్య కాదు కానీ ,అధిక మొత్తంలో తీసుకోవడం వలన ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతుందంట.