నైట్ పడుకునే ముందు గ్రీన్ టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
27 october 2025
Samatha
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ప్రతి రోజూ గ్రీన్ టీ తాగుతారు. కానీ ఉదయం కాకుండా రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వలన కూడా బోలెడు లాభాలు ఉన్నాయంట.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని మీ హెల్త్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటారు. ఇక ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు, డ్రింక్స్‌లో గ్రీన్ టీ కూడా ఒకటి.
ఇది బరువు నియంత్రణకు చాలా దోహదం చేస్తుంది. కానీ చాలా మంది దీనిని ఉదయం తాగడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే రాత్రి పడుకునే సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వలన ఇందులో ఉండే కెఫిన్, ఎల్-థియనిన్‌లు మానసిక స్థితిపై సానుకూల ప్రభావాలను చూపుతాయంట. ఇది మీ మనసుకు హాయినిస్తుందంట.
అంతే కాకుండా మెదడు పనితీరు కూడా మెరుగుప పడేలా చేసి అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుందంట. అందువలన ప్రతి రోజూ రాత్రి ఒక కప్పు గ్రీన్ టీ తాగడం, మానసిక,శారీరక ఆరోగ్యానికి, విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప మార్గం.
రాత్రిపూట గ్రీన్ టీ తాగడం వలన ఇది మీ జీర్ణక్రియపై సానుకూల ప్రభావం చూపుతుందంట. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడమే కాకుండా అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుందంట.
అలాగే మీరు నిద్ర పోతున్న సమయంలో కూడా మీలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ఇది సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఇదే కాకుండా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుందంట.
హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం, పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందంట. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట.