పాములతో ఇలా చేస్తున్నారా.. అయితే మీ ప్రాణం రిస్క్‌లో పడ్డట్లే!
26 october 2025
Samatha
పాముల చాలా ప్రమాదకరం. అందుకే పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. అంతే కాకుండా చాలా మంది పాములంటే భయపడిపోతారు.
పాములు చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ వాటి జోలికి ఎవరైనా వెళ్లితే మాత్రం అవి చాలా కోపానికి గురై కాటు వేస్తుంటాయి.
చాలా మంది పాము కాటు వలన చనిపోతున్నారు. అందుకే పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా పాములు రోడ్డుపై కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలంట.
ముఖ్యంగా చాలా మంది పామును చూస్తే చాలు చాలు గందరగోళానికి గురి అవుతుంటారు. ఇంకొందరైతే ఏకంగా గట్టి గట్టిగా అరుస్తుంటారు.
కానీ పాము కనిపించినప్పుడు మాత్రం ఎప్పుడూ భయపడకూడదంట. ముఖ్యంగా మీరు పామును చూసి అరుస్తూ పరిగెత్తినా అది మీకే ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.
ఎందుకంటే, మనుషులకు ఎంత భయం ఉంటుందో, పాములకు కూడా అంతే భయం ఉంటుంది. మీరు అరుస్తూ పరిగెత్తినా వాటికి ప్రమాదం ఉందని అవి దాడి చేసే ఛాన్స్ ఉన్నదంట.
ఇంకొందరు పాము కనిపిస్తే చాలు కర్రతో కొట్టడానికి, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కూడా మంచిది కాదంట, దీని వలన పాము కోపానికి గురై పాకుతూ వచ్చి కాటు వేస్తుందంట.
అయితే మీకు పాము రోడ్డుపై కనిపిస్తే నిశ్శబ్దంగా నిలబడి ఉండాలంట, దీని వలన పాము వెళ్లి పోయి, ప్రాణాపాయం తప్పుతుంది. అలాగే కొట్టడం లాంటిది చేయకూడదంట, కొన్ని సార్లు ఇది ప్రాణానికే ముప్పు తీసుకురావచ్చు.