కార్తీక మాసం ఉపవాసం సమయంలో గుడిలో ప్రసాదం తినవచ్చా?
Samatha
29 october 2025
పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసం మొత్తం నిత్యం పూజలు చేస్తూ పరమ శివుడిని ఆరాధిస్తుంటారు భక్తులు అందరు.
ఈ సమయంలో ఇంటిలో మాంసాహారలు వండుకోరు, అంతే కాకుండా చాలా మంది ఉపావాసాలు ఉంటూ, భగవంతునికి దగ్గరగా, ఉంటూ, శివనాస్మరణ చేస్తుంటారు.
అయితే ఈ సమయంలో ఉండే ఉపావాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెబుతుంటారు. అయితే చాలా వరకు ఉసావాసం అంటే ఎలాంటి ఆహారం తీసుకోరు.
మరి ఈ ఉపవాసం సమయంలో గుడిలో ఇచ్చే ప్రసాదం తీసుకోవడం శుభప్రదమా? ఉపవాసం సమయంలో గుడిలో ఇచ్చే ప్రసాదం తిన వచ్చా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది
కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఉపావాసం అనేది శరీరాన్ని శుద్ధి చేయడం, మనస్సు మొత్తం భగవంతునిపై లన్నం చేయడం. కానీ చాలా మంది కడుపు మార్చుకుంటారు,
ఇంద్రియ నిగ్రహం, సాత్విక ఆహారంపై దృష్టి పెట్టడం, అయితే చాలా మంది గుడిలో ఇచ్చే ప్రసాదం తిన వచ్చా లేదా అనే అనుమానం ఉంటుంది. కానీ తినడంలో ఎలాంటి తప్పు లేదంట.
గుడిలో ఇచ్చే ప్రసాదం సాక్షాత్తూ స్వామి వారి అనుగ్రహం, అందువలన ఆ ప్రసాదం చాలా పవిత్రమైనది కాబట్టి గుడిలో ఇచ్చే ప్రసాదం తీసుకోవడంలో ఎలాంటి సందేహం అవసరం లేదంట.
ఇక ఉపావాసం సమయంలో ఎక్కువగా, పాలు ,పండ్లు, ప్రసాదాలు మాత్రమే తక్కువ తీసుకోవాలంట, అంతే కాకుండా కొన్ని సమయాల్లో ప్రసాదం తీసుకోవాలో లేదో కూడా మీ ఉపవాసంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు పండితులు.