పాములంటే భయపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు వణికి పోవడమే కాకుండా ఆమడ దూరం పారిపోతుంటారు.
ఇక చాలా మంది పాములు పగపడతాయని చెబుతుంటారు. మరి నిజంగానే పాములు పగబడతాయా? ఇది మన ఊహేనా? నిజమా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
పాములు నిజంగా పగబడతాయి అని అబద్ధం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే? చాలా వరకు పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుందంట.
అవి ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకొని దాడి చేయడం అనేది ఉండదు, పాములు కేవలం ఆహారం, సంతానోత్పత్తి కోసం మాత్రమే ఇతర జీవులపై దాడి చేస్తాయంట.
పాములు ఎక్కువగా వాసనను బట్టి తమ ఆహారం కోసం వేటాడుతాయి. అవి ఒక జీవిరూపాన్ని గుర్తు పెట్టుకోవని చెబుతున్నారు నిపుణులు.
ముఖ్యంగా, పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉండటం వలన కొన్ని సార్లు అవి బయటకు వచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉంది అనే విషయం కూడా మర్చిపోతారని చెబుతున్నారు వెటర్నరీ వైద్యులు
అందుకే పాములు ఏ వ్యక్తిపై పగ పెంచుకొని, వారిని గుర్తించుకొని దాడి చేయడం అనేది అబద్ధం అని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు.
పాములు ఒక వ్యక్తినే పదే పదే కాటు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అతను పాములు ఉన్న చోట ఎక్కువగా ఉండటం కూడా ఒక పెద్ద కారణం అంట.