పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా?.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇదే!

Samatha

5 November 2025

కార్తీక మాసం మొదలవ్వడంతో, పెళ్లి భాజాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కళ్యాణం, కమనీయం అంటూ వాట్సాప్ స్టేటస్ లు మోగిపోతున్నాయి.

ఇక పెళ్లీల సీజన్ స్టార్ట్ కావడంతో చాలా మంది మూడుముళ్ల బంధంతో, తమ కొత్త జీవితం ప్రారంభించడానికి రెడీ అయిపోతుంటారు.

కానీ కొంత మంది మాత్రం అసలు పెళ్లి ఎందుకు? పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ మాట్లాడుతారు. మరి అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇద్దరు వ్యక్తుల నూరేళ్ల జీవితం మూడు ముళ్లతో ముడిపడి ఉంటుంది. ఏ వ్యక్తికి అయినా సరే పెళ్లి అనేది తప్పనిసరి, కానీ కొందరిలో పెళ్లి అవసరమా అనే డౌట్ ఉంటుంది.

ఇంకొందరైతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటారు, కానీ పెళ్లి చేసుకోవడం వెనుక ఓ పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు పండితులు.

ప్రతి వ్యక్తి మూడు రుణాలు తీర్చడం కోసం పుడతారంట, అందులో ఒకటి రుషి రుణం, రెండవది దేవరుణం, మూడవది పితృ రుణం, ఈ మూడు రుణాలు తప్పకుండా తీర్చుకోవాలంట.

అయితే పితృ రుణం అనేది వంశాన్ని కొనసాగించడం ద్వారా పూర్తి అవుతుంది. వారి రుణం తీర్చుకోవాలంటే, వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించాలి.

పితృదేవతలకు తర్ప నాది క్రియలు నిర్వహించే సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణం పూర్తి అవుతుంది. అందుకోసం సంతానం కావాలి, కాబట్టి ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని చెబుతారు పెద్దలు.