పెరుగుతో క్యాన్సర్‌కు చెక్.. రోజూ తింటే ఎంత మేలో..
Samatha
3 November 2025
పెరుగును ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది కనీసం ఒక్క ముద్ద అయినా చివరగా పెరుగుతో తింటారు.
ఇక పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్స్,కాల్షియం ఎముకల బలానికి ఎంతగానో మేలు చేస్తాయి.
అయితే పెరుగు ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా, క్యాన్సర్‌కి కూడా చెక్ పెడుతుందంట. అది ఎలాగో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.
పెరుగుని ప్రతి రోజూ తినడం వలన పెద్ద పేగు క్యాన్సర్ 20 శాతానికి పైగా తగ్గుతుందని చెబుతున్నారు అమెరికాకు చెందిన మాస్ జనరల్ బ్రిగ్ హామ్ అనే ఆరోగ్య పరిశోధనా సంస్థ నిపుణులు.
ఎందుకంటే పెరుగులో అనేక పోషకాలు , యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే లాక్టో బాసిల్లస్, బిఫిడో బ్యాక్టీరియాస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి క్యాన్సర్‌ను నిరోధిస్తాయంట.
ప్రతి రోజూ పెరుగు తినడం వలన ఈ బ్యాక్టీరియా, పేగులలో ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంపొందించి, రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎవరైతే ప్రతి రోజూ క్రమం తప్పకుండా పెరుగు తీసుకుంటారో, వారిలో వ్యాధినిరోధక శక్తి పెరగడమే కాకుండా, అది క్యాన్సర్ కణాల ఎదుగుదలను కూడా అడ్డుకుంటుందంట. శరీరానికి చాలా మేలు చేస్తుందంట.
అందుకే ప్రతి ఒక్కరూ కనీసం వారంలో రెండు సార్లైనా పెరుగుతినాలంట. కానీ కొంత మంది పెరుగు తినడానికి అస్సలే ఇష్టపడరు. కానీ అన్నింటికంటే పెరుగే ఆరోగ్యానికి మంచిదని వారు తెలుపుతున్నారు.