కార్తీక మాసంలో నది స్నానం చేయడం వెనకున్న అతి పెద్ద రహస్యం ఇదే!
Samatha
30 october 2025
కార్తీక మాసం మొదలైంది. 2025వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి. ఈరోజు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజిస్తారు.
అంతే కాకుండా చాలా పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున చాలా మంది నది స్నానం ఆచరిస్తారు. అయితే ఈ రోజు నది స్నానం చేయడం వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం.
అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసంలో శివకేశవులకు పూజలు జరిపిస్తారు. అంతే కాకుండా సూర్యోదయం కంటే ముందే నది స్నానం ఆచరిస్తారు.
అయితే కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేయడం అంటే దేహాన్ని శుభ్రపరుచుకోవడం, ఇది ఆత్మను పవిత్రం చేస్తుంది. అంతేకాకుండా, సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో స్నానం చేయడం వలన గత జన్మలోని పాపాలు తొలిగిపోతాయంట.
ఇక ఈ మసాంలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్ర నుంచి మేల్కొనే సమయం,అలాగే ముఖ్యంగా త్రిమూర్తులు ఈ మాసంలో నదీ జలాలలో కొలువై ఉంటారని నమ్మకం అందుకే కార్తీక నద స్నానం చేస్తారు.
కార్తీక మాసంలో నది స్నానం చేసిన వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభిస్తాయని, సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం, ముఖ్యంగా స్నానం చేస్తూ నీటితో సూర్యుడికి నమస్కారం చేస్తే చాలా పుణ్యం అంట.
అయితే కార్తీక మాసంలో నది స్నానం ఆచరించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంట. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్యం పరంగా కూడా కార్తీక మాసం నది స్నానం అనేక ప్రయోజనాలు అందిస్తుందంట.
కార్తీక మాసం సహజంగానే చలి తీవ్రత మొదలయ్యే నెల. దీంతో ఈ చలికాలంలో శరీరం ధృడత్వాన్ని సంతరించుకునే విధంగానే కాదు వాతావరణానికి అనుగుణంగా తనని తాను మలచుకునెందుకు ఈ కార్తీక మాసంలో నది స్నానం ఆచరిస్తారంట