కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎలా వెలిగించాలి? దీని ఫలితం ఏంటో తెలుసా?

Samatha

30 october 2025

కార్తీక మాసం మొదలైంది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నెల రోజుల పాటు శివున్ని ఆరాధిస్తారు. ప్రతి రోజూ శివాలయానికి వెళ్లి దీపం పెడుతుంటారు.

ముఖ్యంగా ఈ మాసంలో శివకేశవులకు పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుందని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా, కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వారికి పుణ్యం లభిస్తుందని అంటారు.

ఇక కార్తీక మాసంలో చాలా మంది 365 వత్తులు వెలిగిస్తారు. ఈ రోజు ఇలా 365 వత్తులు వెలిగించడం వలన చాలా మంచి జరుగుతుందని, సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం లభిస్తుందని అంటారు.

కాగా, ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపం ఎలా వెలిగించాలి?  దీని వలన కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు వివరం గా తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించడం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. ప్రతి ఒక్కరూ ఈ రోజు పవిత్ర సాన్నం ఆచరించి, ఉపావసం ఉండి, 365 వత్తులతో దీపం వెలిగించాలంట.

ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే 365 వత్తులతో  దీపం వెలిగిస్తారో, వారో, ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసిన, రోజూ దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందంట.

అయితే చాలా మంది 365 వత్తులతో దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లను ఉపయోగిస్తారు. కానీ అలా చేయకూడదంట. కొవ్వొత్తితో కూడా అస్సలే దీపం వెలిగించకూడదంటున్నారు పండితులు.

 కార్తీక పౌర్ణమి రోజున 364 వత్తుల దీపాన్ని అగరబత్తి ఉపయోగించి వెలిగించడం వలన అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయంట. ముఖ్యంగా,  ఇంటి యజమాని ఇలా దీపం వెలిగించడం చాలా శుభప్రదం.