తులసి ఆకులు కాదండోయ్.. మొగ్గలు తినడం వలన జరిగే అద్భుతం ఇదే!

Samatha

3 November 2025

పవిత్రమైన మొక్కల్లో తులసి ఒకటి. అందుకే తులసి చెట్టు లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్క అనేది తప్పని సరిగా ఉంటుంది.

తులసి మొక్క ఇంటిలో ఉండటం వలన వాస్తు ప్రకారం, ఆధ్యాత్మిక పరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

చాలా మంది తులసి ఆకులను తింటుంటారు. అంతే కాకుండా తులసి టీ తాగడం, తులసి రసం తాగడం చేస్తుంటారు. కానీ తులసి ఆకులే కాకుండా, తులసి మొగ్గలు కూడా ఆరోగ్యానికి మంచిదంట.

మీకు వీలైనప్పుడు లేదా అనారోగ్యానికి గురి అయినప్పుడు తులసి మొగ్గలను కషాయంగా లేదా నార్మల్‌గా తినడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, రోగనిరోధకతను పెంచడంలో సహాయపడతాయంట.

అలాగే, జీర్ణ సమస్యలు ఉన్నవారికి తులసి మొగ్గలు చాలా మంచిది. క్రమం తప్పకుండా తులసి మొగ్గలు తినడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.

తులసి మొగ్గలు గుండె ఆరోగ్యానికి చేసే మేలు వివరించలేనిది, తులసి మొగ్గలను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందంట.

ఒత్తిడిని తగ్గించడంలో కూడా తులసి మొగ్గలు సహాయపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, ఇందులో ఉండే ఒత్తిడి నిరోధక లక్షణాలు , ఒత్తిడి నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయంట.

తులసి మొగ్గలు ఆరోగ్యం పరంగానే కాకుండా ఇవి జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.