చీరలో అందంగా రష్మిక.. బ్యూటిఫుల్ ఫొటోస్

Samatha

3 November 2025

అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ చిన్నది.

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రష్మిక, ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ దోచేసుకుంది

తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిదం మూవీలో నటించి, స్టార్ హీరోయిన్ రేంజ్‌తో తన సత్తా చాటింది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్‌లో వరసగా సినిమాలు చేస్తుంది.

పుష్ఫ, ఛావా, యానిమల్,  కుభేర వంటి చిత్రాలతో వరసగా హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, రీసెంట్‌గా థామా చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ, టాప్ మోస్ట్ హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుతుంది.  వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది ఈ బ్యూటీ.

ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ ది గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ,  ఎప్పుడూ తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.

కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో తన అంద చందాలతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.