ఆ చార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. ఈయన ఆయన కాలంలోనే అత్యంత గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. చాణక్యుడికి ఎన్నో విషయాలపై మంచి పట్టు ఉంటుంది.
ఇక గొప్ప రాజనీతిజ్ఞుడు , తత్వవేత్త,కౌటిల్యుడు అంటూ అనేక బిరుదులు ఉన్న చాణక్యడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది.
చాణక్యుడు బంధాలు, బంధుత్వాల గురించి చాలా గొప్పగా తెలియజేశారు. అదే విధంగా ఒక మహిళ తన ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలిపారు.
చాణక్యుడి ప్రకారం, వివాహం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆ నమ్మకం కోల్పోయినప్పుడు, ఆ బంధానికి విలువే లేదు అంటున్నాడు చాణక్యుడు.
ముఖ్యంగా కొన్ని చెడు లక్షణాలు గనుక మీ భర్తలో ఉంటే, ఆయనను వదిలి వేసినా, తప్పే లేదంటున్నాడు చాణక్యుడు. కాగా, భర్తలో ఉండకూడని లక్షణాలు ఏవో చూద్దాం.
ఆ చార్యుడి ప్రకారం ఏ వ్యక్తికి అయితే తన భార్యపై, తన భార్య బంధువులపై గౌరవం ఉండదో, అతనితో కలిసి ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు, అలాంటి భర్తలను వదిలి వేయడమే మంచిదంట
అలాగే ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు, మీ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వచ్చే వ్యక్తితో కలిసి ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్తున్నాడు చాణక్యుడు.
కేవలం భౌతిక సుఖాలకే పరిమితమైన, ధర్మం,నైతికత, ఆధ్యాత్మికత లేని వ్యక్తితో కలిసి ఉండటం మంచిది కాదు, అతనితో మంచి భవిష్యత్తు పొందలేరు అలాంటి వ్యక్తికి దూరం ఉండటం మంచిది.