కివీ శరీరానికి చేసే మేలు ఇదే.. తింటే ఎన్ని లాభాలో..
Samatha
5 November 2025
కివీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన అనేక లాభాలు ఉంటాయని చెబుతుంటారు కాగా, కివీ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
కివీలో విటమిన్స్, మినరల్స్, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి.
అందువలన ప్రతి రోజూ లేదా కనీసం వారంలో రెండు లేదా ఒక్కసారైనా కివీ తినడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
ఎవరైతే నిద్రేలేమి సమస్యతో బాధపడుతున్నారో, వారు క్రమం తప్పకుండా, కివీ పండు తినడం వలన ఇది మంచి నిద్రను ప్రోత్సహించి, నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది.
ఇక కివీ పండు, డయాబెటీస్ పేషెంట్స్ కు వరం అని చెప్పాలి. ఇందులో గ్లైసెమిక్ సూచీలు చాలా తక్కువగా ఉండటం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
జీర్ణ క్రియ ఆరోగ్యానికి కివీ చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది జీర్ణ క్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.
అలాగే కివీ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
కివీ పండులో విటమిన్ సీ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి కూడా సహాయపడుతుంది.