బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
క్రూసిఫెరస్ జాతికి చెందిన క్యాలీఫ్లవర్, బస్సెల్స్, క్యాబెజీలో బ్రోకలీ ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
అందువల బ్రోకలీని మీరు మీ డైట్ లో చేర్చుకోవడం లన ఇందులో ఉండే సల్పోరాఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకొని క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇది ఎముకల బలానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ, రక్తం గడ్డకట్టం తగ్గించడమే కాకుండా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బ్రోకలీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, రక్తహీనత నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
బ్రోకలీని ప్రతి రోజూ లేదా వారానికి రెండు సార్లు తినడం వలన ఇది వృద్ధ్యాప్య ఛాయలను తగ్గించి, చర్మాన్ని నిగారింపుగా తయారు చేస్తుంది.
జీర్ణ క్రియకు కూడా బ్రోకలీ చాలా మంచిది. దీనిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది మలబద్ధకం తగ్గించి, జీర్ణ క్రియ సక్రమంగా సాగాలే చేస్తుంది. పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇది వరమనే చెప్పాలి. ప్రతి రోజూ బ్రోకలీ తినడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది.