చలికాలంలో పెదువులు పగిలిపోతున్నాయా? సింపుల్ టిప్స్ మీ కోసం!
Samatha
13 November 2025
చలికాలం వచ్చిదంటే చాలు, చర్మం పొడిబారడం, పెదవులు, చర్మం పగలడం వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా చాలా మంది పెదవులు పలగడంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం.
చాలా మంది పెదవులు పలకడంతో ఏవో ఏవో క్రీమ్స్, లిప్ బామ్ రాస్తుంటారు. కానీ ఇవేవ లేకుండా ఇంటిలో ఉన్నవాటితో పెవుల పగళ్లుకు చెక్ పెట్టవచ్చునంట.
తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా దీనికి సహజ మాయిశ్చరైజర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన చలికాలంలో పెదవులకు తేనె పూయడం వలన పెదవులు మృదువుగా మారుతాయంట.
తేనెను పెదవులపై పలచగా పొరలా రాసి, 15 నిమిషాలపాటు అలా వదిల వేయాలంట. తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని, పెదవులను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన పగుళ్లు తగ్గిపోతాయి.
అలాగే పెదవులపై కొబ్బరి నూనె లేదా బాదం నూనె అప్లై చేయడం కూడా చాలా మంచిదంట. దీని వలన పెదవులు మృదువుగా తయారు అవుతాయి.
అదే విధంగా పెదవులపై చక్కెరతో స్క్రైబ్ చేయాలంట. ఇలా చేయడం వలన పగిలిన పెదవులు సున్నితంగాతయారు అవుతాయి. చనిపోయిన కణాలు తొలిగిపోతాయి.
చాలా వరకు చలికాలంలో పెదవులు ఎక్కువగా, తగినంత నీరు తాగకపోవడం వలన పగులు తుంటాయి. అందుకే వీలైనంత వరకు ఎక్కువగా నీరు తాగాలంట.