కలలు రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా కలలు కంటారు. ఇక కొంత మంది రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటే, మరికొంత మంది పగటి పూటకూడా కలలు కంటారు.
అయితే స్వప్న శాస్త్రం కలల గురించి కూడా చాలా విషయాలు తెలియజేసింది. కలలో ఏవి కనిపిస్తే మంచిది, కలలో ఏవి కనిపించకూడదు?
ఎలాంటి సమయంలో కలలు రావడం శుభప్రదం, ఎలాంటి సమయంలో కలలు వస్తే నిజం అవుతాయి, ఇలా ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
అయితే ఇప్పుడు మనం స్వప్నశాస్త్రం ప్రకారం మహిళల కలలో మంగళసూత్రాలు కనిపిస్తే ఎలాటి ఫలితాలు ఉంటాయి. ఎలా కనిపించడం మంచిదో చూద్దాం.
వివాహిత స్త్రీలకు కలలో మంగళ సూత్రం విరిగినట్లు, తెగినట్లు కనిపిస్తే అది అశుభ శకునంగా భావించాలి అంట. అలాగే మంగళ సూత్రం మెడలో నుంచి తీసినట్లు కలవస్తే అది కూడా అశుభ శకునం.
దీని వలన భర్తకు ఏదో ఆపద రానున్నది అని అర్థం అంట. అంతేకాకుండా భర్త ఏదైనా సమస్యల్లో , చిక్కుకోవడాన్ని ఇది సూచిస్తుందని చెబుతున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.
అలాగే, ఒక వేళ మీరు మంగళ సూత్రాన్ని కొనుగోలు చేస్తున్నట్లు కల వస్తే అది శుభ సంకేతం. దీని వలన మీరు మీ జీవితంలో ఏదో ఆనందకరమై సంఘటనను ఎదుర్కోనున్నారంట.
అదే విధంగా మంగళ సూత్రాన్ని అమ్మినట్లు కల వస్తే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. అది అశుభకరం, మీ భర్త చిక్కుల్లో పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.