రాత్రి పూట లైట్స్ వేసుకొని నిద్రపోతున్నారా?

Samatha

18 November 2025

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది . కానీ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు.

ఇక కొంత మంద రాత్రి సమయంలో లైట్స్ ఆన్ చేసుకుంటే హాయిగా నిద్రపోతారు, మరికొంత మంది లైట్స్ ఆఫ్ చేసుకుంటే హాయిగా నిద్రపోతారు.

కానీ నైట్ టైమ్ లైట్స్ ఆన్ చేసుకొని నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

లైట్స్ వేసుకొని నిద్రపోవడం వలన ఇది శారీరక సమస్యలకు కారణం అవుతుందంట. లైట్స్ వేసుకొని నిద్రపోయినప్పుడు ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది.

మెదడుకు పూర్తి విశ్రాంతినివ్వదు. దీన శరీరానికి పూర్తిగా నిద్రపట్టక అలసిపోయినట్లు, నీరసం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

అలాగే లైట్స్ ఆన్ చేసుకొని నిద్రపోవడం వలన ఇది చిరాకు, నిరాశ వంటి సమస్యలను కలిగించడమే కాకుండా, మానసిక స్థితిలో మార్పులు తీసుకొస్తుందంట.

అంతే కాకుండా లైట్స్ వేసి నిద్రపోవడం వలన నిద్రలేమి సమస్య వస్తుందంట. దీని వలన మరుసటి రోజు ఉదయం, నీరసం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయి.

తగినంత నిద్ర రాకపోవడం వల్ల ఆకలి హార్మోన్ అయిన గ్రెలిన్ పై నియంత్రణ కోల్పోవచ్చు.  ఇది మీలో ఆకలిని పెంచి, ఊబకాయం బారిన పడేలా చేస్తుందంట.