చాలా మందికి శివుడు అంటే అమితమైన భక్తి ఉంటుంది. నిత్యం శివయ్యకు పూజలు, అభిషేకాలు చేస్తూ, ప్రతి రోజూ శివ ఆరాధాన చేస్తూ గడుపుతారు.
అయితే కొందరు తమ ఇంటిలోపల శివలింగాన్ని పెట్టుకోవాలనుకుంటారు. అయితే దీనిపై చాలా మందికి అనేక రకాల డౌట్స్ ఉంటాయి. ఇంటిలో శివలింగం పెట్టుకోవడం మంచిదేనా? కాదా? అని దానిగురించే తెలుసుకుందాం.
ఇక కొంత మంది తమ ఇంటిలోపల శివలింగాన్ని పెట్టుకొని పూజలు చేస్తుంటారు. అయితే ఇంటిలోపల శివలింగం పెట్టుకోవాలా వద్దా అనేది మీ బాధ్యతపై ఆధారపడుతుందంట.
ఎవరైతే శివలింగాన్ని తమ ఇంటికి తెచ్చుకుంటారో వారు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం పూజ చేయాలంట. అంతే కాకుండా ప్రతి రోజూ తప్పకుండా అభిషేకాలు చేయడం మర్చిపోకూడదంట.
అదే విధంగా మీరు శివలింగాన్ని పెట్టుకునే ప్రదేశం చాలా శుభ్రంగా ఉండటమే కాకుండా, నీటిని అందిస్తూ, ప్రశాంతత వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి అంట. దాని వలన శివారాధన వృద్ధి చెందుతుందంట.
అలాగే పూజ చేయడం దాట వేయడం, నిత్యం పూజ చేయకుండా ఉండటం, ప్రదేశం అపరిశుభ్రంగా ఉండటం వలన జీవితంలో సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంట.
అందుకే ఇంటిలో శివలింగం ఉండటం కంటే, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం చాలా మంచిది. రోజూ మీ దగ్గరిలోని శివాలయాన్ని సందర్శించడం, శివుడి చిత్రపటానికి పూజ చేయడం చేయవచ్చు.
అంతే కాకుండా, ప్రతి రోజూ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం, రుద్రాక్ష పూజ మంత్రం ఇలా వీటన్నిటినీ పూజించడం వలన మీ పై శివుడి అనుగ్రహం ఉంటుందంట.