మీ పిల్లలకు దిష్టి తగులుతోందా.. వెంటనే తొలిగించే పరిహారాలు ఇవే!
Samatha
21 November 2025
చాలా మంది పిల్లలకు చాలా త్వరగా దిష్టి తగులుతుంటుంది. దీంతో పిల్లలు చికాకు పడటం , కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు.
ఇక వ్యక్తి అసూయతో చూసే చెడు చూపును దిష్టి అంటారు. ఇది ఒక వ్యక్తి జీవితంలో చాలా సమస్యలను సృష్టించగలదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు.
ముఖ్యంగా కను దిష్టి చాలా ప్రమాదకరం. దీని వలన దిష్టి తగిలిన వ్యక్తి, చిన్నపిల్లలు ఆరోగ్యం క్షీణించడం, పనుల్లో ఆటంకాల వంటి సమస్యల బారినపడుతుంటారు
చిన్నపిల్లలకు చాలా ఎక్కువగా దిష్టి తగులుతుంటుంది. ఏం చేసినా కొన్ని సార్లు దిష్టి త్వరగా పోదు, అయితే మనం ఇప్పుడు దిష్టిని తరిమికొట్టే చిట్కాలు ఏవో చూసేద్దాం.
దిష్టి త్వరగా పోవాలి అంటే, అమావాస్య రోజున కర్పూరం వెలిగించి, దానితో దిష్టి తియ్యడం వలన వ్యక్తి కను దిష్టి అనేది చాలా త్వరగా పోతుందంట
అదే విధంగా కొబ్బరికాయ, లేదా నిమ్మకాయ, బూడిదె గుమ్మడి కాయలను ఐదు సార్లు చుట్టూ తిప్పి, రోడ్డుపక్కన పగలగొట్టడం వలన త్వరగా నెగిటివ్ ఎనర్జీ పోతుందంట.
ఇవే కాకుండా చేతిలో ఉప్పు, ఎండు మిరపకాయలను పట్టుకొని, మూడు సార్లు తిప్పి వీటిని అగ్నిలో వేయడం వలన కూడా త్వరగా దిష్టి దోషం తొలిగిపోతుందంట.
చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు దిష్టి తీస్తుంటారు. కానీ అమావాస్య రోజు దిష్టి తియ్యడం చాలా మంచిదంట. ఈ రోజు దిష్టి త్వరగా పోతుందని చెబుతున్నారు పండితులు.