గోంగూరతో చేసే వంటకాలు ఎవరికి నచ్చవు చెప్పండి. చాలా మందికి గోంగూర పచ్చడి, గోంగూర చికెన్ వంటి వంటకాలు చాలా ఇష్టం.
అయితే మనం ఎంతో ఇష్టంగా తినే గోంగూర వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
గోంగూర సైంటిఫిక్ పేరు హైబిస్కస్ శబ్దరిఫా అని కూడా పిలుస్తారు. గోంగూర పెద్ద పెద్ద ఆకులుతో , దీని రుచి చాలా పుల్లగా ఉంటుంది. దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
గోంగూరలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తీసుకోవడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుందంట.
అంతే కాకుండా ఇందులో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడే వారు దీనిని డైట్‌లో చేర్చుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.
గోంగూర తినడం వలన ఇ ది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తుందంట. అందువలన మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇది తీసుకోవడం చాలా మంచిది.
అలాగే గోంగూరలో ఉండే పొటాషియం, ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యం చేసి, హైపర్ టెన్షన్ సమస్యను కూడా తగ్గిస్తుందంట. అంతే కాకుండా అధిక రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది.
గోంగూరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని తీసుకోవడం వలన ఆర్థరైటీస్ సమస్యను తగ్గిస్తుంది నొప్పుల సమస్యలు కూడా మీ దరిచేరవంట