చలికాలంలో పల్లీలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
Samatha
20 November 2025
పల్లీలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ పల్లీలు తినడం వలన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు ఆరోగ్య నిపుణులు.
ఇక పల్లీల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇక వీటిని చాలా మంది వాతావరణం, సమయంతో సంబంధం లేకుండా తింటుంటారు.
కానీ కొంత మంది అస్సలే చలికాలంలో పల్లీలు తినకూడదు అని చెబుతుంటారు. కానీ చలికాలంలో పల్లీలు తినడం వలన చాలా ప్రయోజన
ాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పల్లీల్లో ప్రోటీన్, కొవ్వు , కార్బోహైడ్రేట్స్, ఫైబర్ , కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. వీటి వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి.
చలికాలంలో వీటిని తినడం వలన ఎముకలు బలంగా తయారు అవుతాయంట. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి.
పల్లీల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన చకాలంలో వీటిని ఎక్కువగా తినడం వలన ఇవి శరీరాన్ని ఉత్తేజ పరుస్తాయి. అదే విధంగా జీర
్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయంట.
చలికాలంలో ప్రతి రోజూ వేరుశనగలు తినడం వలన ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
పల్లీల్లో వేరుశనగలు ఎక్కువగా ఉండటం వలన మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, ఆకలిని అదుపులో ఉంచుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలంలో అస్సలే తినకూడని ఫ్రూట్స్ ఇవే!
జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగితే వచ్చే రోగాలు ఇవే!
మీ ఇంటిలో గులాబీ మొక్కను పెంచుతున్నారా.. ఇలా చేస్తే చెట్టు నిండా పూలే..