చాణక్య నీతి : ఈ వస్తువులు పోగొట్టుకుంటే దొరకడం కష్టం.. జాగ్రత్త పడాల్సిందే!

Samatha

21 November 2025

ఆ చార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది.

అదే విధంగా ఆయన ఒక వ్యక్తి తన జీవిత కాలంలో కొన్నింటిని కోల్పోతే వాటిని మళ్లీ సాధించుకోలేడని తెలియజేయడం జరిగింది.

కాగా, అసలు ఒక వ్యక్తి తన జీవితంలో వేటిని చాలా విలువైన విధంగా కాపాడుకోవాలి? వేటిని  పోగొట్టుకోకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

సమయం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే సమయాన్ని కోల్పోతే మళ్లీ తిరిగిపొందలేరు అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.

ఏ వ్యక్తి అయినా సరే సమయాన్ని కోల్పోతే,దానిని పొందలేరు, ఆ సమయంలో ఎంత పశ్చాత్తాప పడ్డా అది తిరిగి రాదు అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలంట.

ఏ బంధానికి అయినా సరే నమ్మకమే పునాది. ఒక్కసారి ఒక్క వ్యక్తి మీద నమ్మకం పోతే అది మళ్లీ తిరిగిరాదు. అందుకే ఎప్పుడూ కూడా ఇతరుల వద్ద నమ్మకం పొగొట్టుకోకూడదంట.

చాణక్యుడి ప్రకారం మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అంట. ఒక్కసారి మాట జారితే దానిని మనం మళ్లీ వెనక్కు తీసుకోలేం. అందుకే కఠిన మాటలు మాట్లాడకూడదు అంటున్నాడు చాణక్యుడు.

ఆ చార్య చాణక్యుడు అవకాశాన్ని కోల్పోతే దానిని మళ్లీ పొందలేవు అని చెబుతున్నాడు. అందుకే ఎప్పుడూ కూడా అవకాశాలను వదులు కోకూడదంట.