ప్రతి ఒక్కరి వంటింట్లో టమాటాలు ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా వీటిని ఏ కర్రీలో వేసినా టేస్ట్ అదిరిపోతుంది.
ఇక టమాటాల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి చాలా మంది ఎంతో ఇష్టంగా టమాటాలను తింటుంటారు.
అయితే టమాటాలు ఆరోగ్యానికి ఎంత మంచిది అయినప్పటికీ కొందరు వీటిని తినడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, టమాటాలు ఎవరు తినడం మంచిది కాదో చూద్దాం.
ఎవరైతే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారో వారు టమాటాలు తినడం అస్సలే మంచిది కాదంట. వీటి విత్తనాలు తినడం వలన రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుందంట.
గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే టమాటాలు తినకూడదంట. ఇద కడుపులో ఆమ్లత్వాన్ని ఎక్కువగా పెంచుతుంది.
అలెర్జీ, దద్దర్లు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు అస్సలే టమాటాలు తినకూడదంట. దీని వలన అలెర్జీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు.
అదే విధంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు కూడా టమాటాలు తినడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు. దీని వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.
అలాగే కీళ్ల నొప్పులు, అధిక యూరిక్ యాసిడ్ ఉన్న వారు, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే టమాటాలు తినకూడదు అని చెబుతున్నారు నిపుణులు.