ఖర్జూరం అతిగా తింటే ఈ సమస్యలు తప్పవు!

Samatha

23 November 2025

ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు ఒక్క ఖర్జూరం అయినా తినాలని చెబుతారు వైద్య నిపుణులు.

ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, వీటిని అతిగా తినడం కూడా చాలా ప్రమాదకరం అంట. కాగా, ఖర్జూరం అతిగా తినడం వలన ఎలాంటి సమస్యలు కలుగుతాయో చూద్దాం.

ఖర్జూరంలో ఫైబర్,పొటాషియం, విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.  అందుకే ఇది మితంగా తీసుకుంటే శరీరానికి చాలా మేలు చేస్తుంది.

ఖర్జూరంలో కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువలన వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కొవ్వు పెరిగి, ఊబకాయం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందట.

అదే విధంగా ఖర్జూరంలో అధిక చక్కెర ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ తీసుకుంటే వారిలో హైపో గ్లైసోమియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.

ఖర్జూరం అధిక మొత్తంలో తీసుకోవడం వలన జీర్ణక్రియ మందగించి, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయని చెబుతున్నారు నిపుణులు.

అలర్జీ, దంత సమస్యలు ఉన్నవారు కూడా ఖర్జూరం అతిగా తీసుకోవడం వలన చర్మం ఎర్రబడటం, దంత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట.

అందుకే ఖర్జూం అధిక మొత్తంలో కాకుండా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం పరగడుపున తినడం చాలా మంచిదంట