రాత్రి సమయంలో పాములు నిద్రపోతాయా?

Samatha

29 November 2025

పాములు అంటే భయం ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు వణికిపోతుంటారు. ఇంకొందరైతే కనీసం వాటిని దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడరు.

ఇక కొంత మందికి పాములంటే భయం ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో మాత్రం చాలా ఇంట్రస్ట్ ఉంటుంది.

అయితే ఇప్పుడు మనం పాములకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం తెలుసుకుందాం. పాములు నిద్రపోతాయి, కానీ అవి రాత్రి సమయంలో నిద్రపోతాయా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

కాగా, ఇప్పుడు మనం అసలు పాములు రాత్రి సమయంలో నిద్రపోతాయా? అసలు ఇవి రాత్రి సమయంలో ఎంత సేపు నిద్రపోతాయి అనే విషయం తెలుసుకుందాం.

సామాన్యంగా పాములు దాదాపు 16 గంటలు నిద్రపోతాయంట. ఇక ఆఫ్రికా, ఆసియాలో కనిపించే పెద్ద పెద్ద పైథాన్ పాములు అయితే కనీసం 18 గంటలు నిద్రపోతాయంట.

పాములు అనేవి ఎక్కువగా చలికాలంలో చాలా సేపు నిద్రపోతాయంట. ఈ సీజన్‌లో ఇవి ఎక్కువగా నిద్రావస్థలో ఉంటాయంట.

చాలా మంది రాత్రి సమయంలో పాములు నిద్రపోతాయి అనుకుంటారు. కానీ ఇవి ఎక్కువగా పగటి పూట నిద్రపోయి రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయంట.

ఇక పెద్ద పెద్ద పైథాన్ పాములు అయితే పగటి పూట ఎక్కువ సేపు నిద్రపోయి, రాత్రి సమయంలో ఆహారం కోసం వెతుకులాడుతాయంట. రాత్రి సమయంలోనే ఇవి ఎక్కువ ఉత్సాహంగా ఉంటాయంట