03 December 2025
హెచ్చరిక .. ఉదయాన్నే అస్సలే తాగకూడని జ్యూస్ ఇదే!
samatha
Pic credit - Instagram
ఉదయాన్నే నారింజ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటారు. కానీ దీని వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంట.
చాలా మంది ఉదయం అల్పాహారం తీసుకోవడానికి బదులు ఈ మధ్య ఎక్కువగా జ్యూస్‌లు తాగడానికి ప్రిపరెన్స్ ఇస్తున్నారు. కానీ ఇది
అస్సలే మంచిది కాదంట.
ముఖ్యంగా నారింజలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన చాలా మంది దీనిని ఉదయాన్నే హెల్త్ డ్రింక్‌గా తీసుకుంటున్నారు.
అయితే ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నారింజ జ్యూస్ తాగడం వలన దీనిలోని ఫ్రక్టోజ్ నేరుగా రక్తంలో కలిసిపోయి, షుగర్ లెవల్స్ వేగంగా తగ్గిప
ోయే ఛాన్స్ ఉన్నదంట.
దీంతో శరీరంలో వణకు, బద్ధకం, తీవ్రమైన ఆకలి వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలికంగా కొనసాగితే, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుందంట.
అలాగే నారింజ జ్యూస్ ఎక్కువగా తాగడం వలన ఇది కడుపులోని జీర్ణ రసాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
ఉదయాన్నే నారింజ జ్యూస్ తాగడం వలన ఇందులో ఉండే ఆమ్లతత్వం వలన ఇది కాల్షియం, మెగ్నీషియం వంటి శోషణను తగ్గించి, ఎముకల బలహీనతకు కారణం అవుతుంది.
అదే విధంగా, దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం, మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఏర్పడే ప్రమ
ాదం ఉన్నదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ టిప్స్ పాటిస్తే.. మీ వంట క్షణంలో పూర్తి అవుతుంది!
చలికాలంలో గ్రీన్ ఆపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
చలికాలంలో ఉసిరి చేసే మాయే వేరు.. తింటే ఎన్ని లాభాలో..