చలికాలంలో గ్రీన్ ఆపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
samatha
Pic credit - Instagram
గ్రీన్ ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని చలికాలంలో తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంట.
చలికాలంలో రోజుకు ఒక ఆపిల్ పండు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉండాలి అంటే డాక్టర్ రోజుకు ఒక ఆపిల్ పండు తినాలని చెబుతుంటాడు. అయితే కొందరు రెడ్ ఆపిల్ తింటే, మరికొందరు గ్రీన్ ఆపిల్ తింటారు.
అయితే గ్రీన్ ఆపిల్ పండులో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయంట. ఇందులో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.
అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాలా మంచిది. రోజు ఒక గ్రీన్ ఆపిల్ పండు తినడం వలన చాలా త్వరగా బరువు తగ్గవచ్చునంట.
గ్రీన్ ఆపిల్స్‌లో పొటాషియం పుష్కలంగాఉ ఉంటుంది. అందువలన ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును తగ్గిస్తుంది. అందువలన దీనిని రోజుకు ఒకటి తింటే బీపీ తగ్గుతుందంట.
గ్రీన్ ఆపిల్స్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ప్రతి రోజూ ఒక ఆపిల్ పండు తినడం వలన ఇది హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తుందంటున్నారు నిపుణులు.
గ్రీన్ ఆపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడమే కాకుండా, మలబద్ధకం వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది.