చాణక్య నీతి : ఎవరి ఇంటిలో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదో తెలుసా?
samatha
Pic credit - Instagram
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు . ఈయన ఎన్నో విషయాల గురించి చాలా ఎక్కువగా తెలియజేసిన విషయం తెలిసిందే.
చాణక్యుడు బంధాలు, బంధుత్వాల గురించి చాలా ఎక్కువగా తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన ఎవరి ఇళ్ల్లో ఉండటం మంచిది కాదో కూడా తెలియజేశాడు.
కొందరు వ్యక్తుల ఇళ్ల్లో ఎక్కువ సేపు గడపడం వలన అదృష్టం చేయిజారడమే కాకుండా, అనేక సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉన్నదంట. ఇంతకీ వారు ఎవరంటే?
ఆ చార్య చాణక్యుడి ప్రకారం చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వ్యక్తుల ఇంటిలోపల అస్సలే ఎక్కువసేపు గడపకూడదంట. ఎందుకంటే వారి ఇల్లు ఎప్పుడూ ఉద్రిక్తతలతో నిండి ఉంటుంది.
అదే విధంగా వారు మీపై ఎప్పుడు కోపం తెచ్చుకుంటారో తెలియదు. దీని వలన మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అంతే కాకుండా కొన్ని సార్లు అది మీ అదృష్టాన్ని కూడా పొగొడుతుందంట.
అదే విధంగా అబద్ధాల కోరు లేదా మోసగాడు అయిన వ్యక్తితో ఎక్కువ సేపు గడపడం, వారి ఇంటిలో ఎక్కువ సేపు ఉండటం చేయకూడదంట. దీని వలన మీరు ఇరకాటంలో పడుతారు.
ముఖ్యంగా వారితో ఎక్కువ సేపు గడపడం వలన వారి ప్రవర్తన తీరు మీపై కూడా ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా మీలో ఒత్తిడికి కారణం అవుతుంది.
అలాగే సోమరితనం ఉన్న వారితో ఎక్కువ సేపు గడపడం వలన మీరు కూడా సోమరిగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.