03 December 2025

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఇక అదృష్టానికి కొదవే ఉండదు!

samatha

Pic credit - Instagram

ఆరోగ్యం, ఆనందానికి మించిన సంపద లేదంటారు. ఎన్ని కోట్లు పెట్టినా మనం ఆనందాన్ని  కొనలేం. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటారు.

అయితే కొంత మంది తమ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. కానీ మరికొంత మంది ఇంటికి వెల్లగానే ఏదో ప్రశాతంతను కోల్పోయినట్లు , గజిబిజిగా ఉంటారు. దీనికి కారణం వాస్తు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు మీ ఇంటిలో పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతందంట. అందులో స్పైడర్ ప్లాంట్ ఒకటి. ఇది చల్లదనాన్ని అందించడమే కాకుండా, ప్రశాంతతను కలిగిస్తుంది.

చాలా మంది ఇళ్లలో స్నేక్ ప్లాంట్ ఉంటుంది. అయితే దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

లావెండర్ ప్లాంట్ ఇంటికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తుంది. అంతే కాకుండా మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలంట.

ఇంట్లో సులభంగా పెరిగే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. ఈ మొక్కను ఇంటిలోపల పెంచుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వాస్తు ప్రకారం ఇది లక్కు తీసుకొస్తుందంట.

మంచి సువాసనలు వెదజల్లే పుదీన మొక్క ఇంటిలో పెంచుకోవడం చాలా సులభం అంతే కాకుండా దీనిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన ఇది ఇంటిలో పెంచుకోవడం చాలా మంచిదంట.

కలబంద వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువలన ఎవరైతే కలబంద మొక్కను ఇంటిలో పెంచుకుంటారో వారికి అన్ని విధాల కలిసి వస్తుందంట.