మీ జుట్టు పట్టుకుచ్చులా పెరగాలా? ఉల్లిని వారానికి 2 సార్లు ఇలా వాడండి
05 December 2025
TV9 Telugu
TV9 Telugu
నేటి కాలంలో జుట్టు రాలిపోయే సమస్యతో అధిక శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక వ్యాధులు, మందుల వాడకం వంటి అనేక కారణాలు ఉన్నాయి
TV9 Telugu
అయితే జుట్టు రాలే సమస్యకు ఉల్లిపాయతో చెక్ పెట్టొచ్చు. ఉల్లి జుట్టు రాలడాన్ని తగ్గించి, శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎలా వాడాలంటే..
TV9 Telugu
కొన్ని ఉల్లిపాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని నేరుగా జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి
TV9 Telugu
ఉల్లిపాయ గుజ్జు మరీ ఘాటుగా ఉంటుందని భావిస్తే కొన్ని నీళ్లను కలిపి వాడవచ్చు. తరువాత 30 నిమిషాల పాటు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయాల్సి ఉంటుంది
TV9 Telugu
దీని వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గిస్తుంది
TV9 Telugu
దీంతో శిరోజాలు సురక్షితంగా ఉంటాయి. తలలో ఉండే ఇన్‌ఫెక్షన్ సైతం తగ్గిపోతుంది. అలాగే ఉల్లితో కొబ్బరినూనెను కూడా కలిపి వాడుకోవచ్చు
TV9 Telugu
ఉల్లిపాయలను మెత్తగా చేసిన తరువాత అందులో కొద్దిగా కొబ్బరినూనెను కలిపి మిశ్రమంగా మార్చాలి. దీన్ని తలకు బాగా మర్దనా చేసి 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి
TV9 Telugu
ఇలా వారంలో 2 సార్లు చేస్తే అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. శిరోజాలు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. దురద సైతం తగ్గుతుంది