Andhra: వామ్మో.. సిక్కోలు సముద్ర తీరంలో భారీ తిమింగలం.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
బంగళాఖాతంలోని తూర్పు తీర ప్రాంతంలో అరుదైన చేపలు, తిమింగలాలు, డాల్ఫిన్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసింది. తీరం నుంచి సముద్రం లోపలకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇవి తరచూ కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి కూడా.. అయితే ఇటీవల ఇవి సముద్ర కెరటాలతో పాటు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి.

బంగళాఖాతంలోని తూర్పు తీర ప్రాంతంలో అరుదైన చేపలు, తిమింగలాలు, డాల్ఫిన్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసింది. తీరం నుంచి సముద్రం లోపలకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇవి తరచూ కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి కూడా.. అయితే ఇటీవల ఇవి సముద్ర కెరటాలతో పాటు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 193 కిలో మీటర్ల మేర సముద్ర తీరం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఇవి ఎక్కువుగా తీరానికి కొట్టుకు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాలోని నేతాజీ బీచ్ కి భారీ తిమింగళం కొట్టుకువచ్చింది. బలమైన సముద్ర కెరటాలకు అది ఒడ్డుకు వచ్చింది.

Giant whale at Srikakulam beach
తిమింగలం తిరిగి సముద్రం లోపలకు వెళ్లలేక ఒడ్డున పడి ఉండగా.. స్థానిక మత్స్యకారులు దానిని గుర్తించారు. అప్పటికీ ప్రాణాలతోనే ఉండటంతో సముద్రంలోకి దానిని నెట్టి వేస్తే బతకవచ్చని భావించారు. దీంతో పలువురు మత్స్యకారులు దానిని అలలు వచ్చే సమయంలో సముద్రంలోకి నెట్టే ప్రయత్నం చేసారు. కానీ అది చాలా బరువుగా ఉండటంతో విఫలయత్నం అయ్యారు. దీని బరువు సుమారు 800 కేజీలు ఉంటుందని స్థానిక మత్స్యకారులు అంచనా వేస్తున్నారు.
వీడియో చూడండి..
ఇక చేసేది లేక మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక భారీ తిమింగలం ఇలా తీరానికి కొట్టుకు వచ్చిందని చుట్టుపక్కల గ్రామల ప్రజలకు తెలియడంతో.. దానిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. కొందరు అయితే తమ మొబైల్ ఫోన్ లతో తిమింగలం ఫొటోలు తీశారు. మరికొందరు దానితో సెల్ఫీలు దిగారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
